అన్ని ఆర్టికల్స్ ENGLISH లో వ్యక్తపరచి ఇది ఎందుకు తెలుగు?? కారణం ఉంది..
మనకి ఎన్ని భాషలు తెలిసినా, ఫీలింగ్స్ ని 100% వ్యక్తపరచడానికి మాతృ భాషని మించిన భాష లేదు..
అన్నీ మరచిపోదాం.. ప్రేమ విలువ గురించి, మనిషి విలువ గురించి, కాలం విలువ గురించి మాత్రమే మట్లాడుకుందాం..
ప్రేమ గురించి మాట్లాడుకుంటే, ప్రేమ గురించి అంటున్నాను అంటే అమ్మాయి అబ్బాయి మధ్యనే కాదు.. భార్యాభర్తల మధ్య కూడా.. చాలా చిన్న చిన్న కారణాలకి విడిపోతున్నారు.. చిన్న చిన్న కారణాలకి.. వాటిలో కోపం, పొగరు, ప్రతీది కూడా ఒక కారణం అని చెప్పచ్చు.. చట్టబద్దంగా విడిపోయే హక్కు భార్యాభర్తల నంబంధానికి మాత్రమే ఉంది.. కానీ ఈ సమాజంలో ఎంతమంది మానసికంగా విడిపోతున్నారు?? తల్లితండ్రులని వదిలేసిన పిల్లలు, ఆస్తి కోసం విడిపోయిన అన్నదమ్ములు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.. మిమ్మల్ని మీరే ప్రెశ్నించుకోండి.. మీకే అర్ధం అవుతుంది...
నేను ఇక్కడ ప్రస్తావించేది ఇలా విడిపోయె ప్రతి మనిషి లో లోపించిన ప్రేమ గురించి, కమ్మేసిన ఆశ గురించి, చెడగొట్టిన స్వార్ధం గురించి...
ఎన్ని సాధించినా ఎన్ని సంపాదించిన మనిషికి మనసులో అనందం కలిగించేది ఎంటో తెలుసా?? "అరేయ్ బాగున్నావా??" అని మనం / మనల్ని ప్రేమించేవాళ్ళు ప్రేమతో అడిగే మాటలు...
ఇక్కడ ఆ ప్రేమ గురించి మట్లాడుతున్నా...
ఇది ఒక కథ... ఎప్పటి నుండో నా మనసులో ఉన్న ఒక కథ ఇది.. నాకు బ్లాగ్ లేని రోజుల్లో స్నేహితులకి మైల్ గా పంపించాను ఈ కథని.. ఇప్పుడు బ్లాగ్ వుంది కాబట్టి.. ఇక్కద ఈ కథని చెప్తున్నాను...
ఈ రోజుల్లో ఈ యువతరంలో అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ అనేది సహజం... ఇక్కడ నేను చెప్పేది కూడా ఒక అబ్బాయి, అమ్మాయి గురించి, వాళ్ళ మధ్య వున్న ప్రేమ గురించి.. ఇంజినీరింగ్ కళాశాలలో చేరిన తరువాత స్నేహితులు అయ్యి, అటు నుండి ప్రేమికులగా మారిన ఒక చిన్న కథ.. ఆ అమ్మాయి, అబ్బాయి ఒకే కాలేజ్ లో చేరారు.. మంచి స్నేహితులు అయిన వాళ్ళు ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం.. మొదటి నుండి అమ్మాయి కుటుంబసభ్యులు తన ప్రేమ ని వ్యతిరేకిస్తారు.. కులము అని, మతము అని వగేరా కారణాలతో.. నువ్వు ఆ అబ్బాయి ని పెళ్ళి చేసుకుంటే మిగిలిన నీ జీవితం అంతా చాలా కష్టపడాలమ్మ అని ఆ అమ్మాయి తల్లితండ్రులు చెప్తున్నారు..
ఇలా కుటుంబసభ్యుల వత్తిడి వల్ల ఆ అమ్మాయి అబ్బాయి ఎప్పుడు తరచుగా గొడవ పడుతూ ఉండే వాళ్ళు.. ఆ అమ్మాయికి అబ్బాయి అంటే చాలా ఇష్టం అయినాసరే ఎప్పుడు ఆ అబ్బాయిని "నీకు నేనంటే ఎంత ఇష్టం??" అని అడిగేది.. కాని ఆ అబ్బయికి మాట్లాడటం రాదు.. ఎలా మాట్లాడాలో తెలీదు.. అందుకు ఎప్పుడు తన జవాబు అమ్మాయికి బాధ కలిగిస్తూనే ఉండేవి.. దానితో కుటుంబసభ్యులు కూడా ఎక్కువ అవ్వడంతో ఆ అమ్మాయికి అబ్బాయి మీద కోపం పెరిగింది.. ఆ అబ్బాయి కూడా ఆ బాధని మౌనం గానే భరించాడు..
కొన్ని సంవత్సరాలు తరువాత ఆ అబ్బాయి డిగ్రీ పూర్తిచేసి MS కోసం అమెరికా వెళ్ళాలి అనుకున్నాడు.. దానికన్నా ముందు అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరకి వచ్చాడు తన ప్రేమ విషయం చెప్పడానికి..
"నాకు మట్లాడటం రాదు., ఎలా మాట్లాడాలో తెలీదు కాని నాకు తెలిసింది మాత్రం నిన్ను ప్రేమించడం. నువ్వు నన్ను ఒప్పుకుంటే జీవితం అంతా నీకు తోడుగా వుంటాను.. ఇక నుంచి ప్రతి క్షణం నీ జీవితం నేను చూసుకుంటాను.. మీ అమ్మానాన్నలతో కూడా బాగా మాట్లడటానికి ప్రయత్నం చేస్తాను.. నన్ను పెళ్ళి చేసుకుంటావా????" అని అడిగాడు..
అమ్మాయి తనని ఒప్పుకుంది.. అమ్మాయి తల్లితండ్రులకి కూడా అబ్బాయి నచ్చాడు.. అందుకని అబ్బాయి అమెరికా వెళ్ళిపోక ముందే వాళ్ళకి నిశ్చితార్ధం జరిగిపోయింది.. అమ్మాయి ఇక్కడే మనదేశం లో మంచి ఉద్యోగం చేస్తుంది.. అబ్బాయి అమెరికా లో MS చేస్తున్నాడు... ప్రతి రోజు వాళ్ళ ప్రేమని ఈమయిల్స్ ద్వారా ఫోన్ కాల్ల్స్ ద్వారా పంచుకునే వాళ్ళు.. మనుషుల పరంగా వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా మనసులు పరంగా ఎప్పుడూ దగ్గరగానే వున్నారు..
ఒక రోజు ఆ అమ్మాయి వుద్యొగానికి వెళ్తుంటే అదుపు తప్పిన కార్ ఒకటి ఆమెని ఢీ కొట్టి వెళ్ళిపొయింది.. తీవ్రంగా గాయపడిన అమ్మాయి కళ్ళు తెరిచి చూసే సరికి ఆమె పక్కన చుట్టూ ఉన్న తన కుటుంబసభ్యులు కూర్చుని వుంది.. తనని ఓదార్చాల్సిన తల్లి ఏడుస్తుంటే తన తల్లి ని చూసి ఆ అమ్మాయి ఒదార్చడానికి, ధైర్యం చెప్పడానికి కదిలింది.. "ఆమ్మ" అని పిలిచిన ఆమె గొంతు లో నుంచి మాత్రం మాట వినపడలేదు.. ఎంత ప్రయత్నించినా ఆమె మాట్లాడలేక పొయింది.. ఆ అమ్మాయి తన గొంతు ని కోల్పోయింది..
డాక్టర్ చెప్పాడు., తనకు తగిలిన గాయం మెదడుకి గట్టిగా తాకడంతో తను మాట కోల్పోయింది అని.. ఒక పక్క తనని ఒదార్చుతున్న తల్లి ని చుస్తూ మాట రాని తన మౌనాన్ని తలుచుకుని కుప్ప కూలిపోయింది ఆ అమ్మాయి.. ఆ అమ్మాయి హాస్పిటల్ లో వున్న అన్ని రోజులు, తన మూగ వేదన కి తోడుగా నిలిచింది మాత్రం నిశ్శబ్ధం ఒక్కటే....
తిరిగి ఇంటికి చేరుకున్న ఆ అమ్మాయికి అన్నీ మామూలుగానే కనిపించినా ఆ అబ్బాయి నుండి వస్తున్న ఫోన్ రింగ్ టోన్ మత్రమ్ తన గుండెల్లో గుచ్చుకునేంత బాధని కలిగించేది..
ఆ అబ్బాయి కి తన ప్రమాదం గురించి తెలియడం, ఆ అబ్బాయికి ఇంకా తను భారంగా మారడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు.. ఆ అమ్మాయి ఆలోచించి అబ్బాయికి ఒక మెయిల్ రాసింది.. "ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి??? వేచి చూసే ఓపిక నాకు లేదు.. ఇక మీదట నేను నీ కోసం ఎదురు చూడలేను" అని చెప్పింది...
దానితో పాటు నిశ్చితార్ధం ఉంగరం కూడా అబ్బాయికి పంపించేసింది.. ఆ మెయిల్ కి బదులు గా కొన్ని లక్షల జవాబులు, లెక్కలేనన్ని ఫొనె కాల్ల్స్ పమ్పించాడు అబ్బాయి.. ఆ అమ్మాయి మాత్రం చేసింది ఒక్కటే.. రింగ్ అవుతున్న అదే ఫోన్ ని చూస్తూ ఏడవటం, ఏడ్చింది, ఏడుస్తుంది... ఇప్పటికి ఏడుస్తూనే వుంది... ఆ అమ్మాయి తల్లి తండ్రులు వేరే ప్రాంతం వెళ్ళిపోవాలి అనుకున్నారు.. అప్పుడైన వాళ్ళ అమ్మాయి తిరిగి మామూలు మనిషి అవుతుంది అని ఆశతో..
కొత్త ఊరు, కొత్త ప్రాంతం... కొత్త మనుషులు.. ఆ అమ్మాయి దనితో పాటు కొత్త భాష నేర్చుకుంది.. "మూగ భాష" దనినె మనం ఇంగ్లీష్ లో సైన్ లాంగ్వేజ్ అంటాం.. ఆ భాష నేర్చుకున్న ఆ అమ్మాయి ప్రతి రోజు అద్దం ముందు నిలబడి "ఆ అబ్బాయిని మర్చిపో" అని తనకు తనే చెప్పుకుంటూ వుండేది.
ఒక రోజు ఆమె స్నేహితురాలు వచ్చి ఆ అబ్బాయి మళ్ళీ వచ్చాడు అనే విషయం ఆ అమ్మయికి చెప్పింది.. అప్పుడు ఆ అమ్మాయి దయచేసి నేను ఎక్కడ వున్నాను అనే విషయం ఆ అబ్బాయికి తెలియనివద్దు అని మాట అడిగింది.. ఆ రోజు నుంచి ఆ అబ్బాయి గురించి ఎలాంటి వార్త మళ్ళీ ఆ అమ్మాయి వినలేదు..
కాలం తిరిగింది, కాలెండర్ మారింది, 1 సంవత్సరం గడిచింది... మళ్ళీ తన స్నేహితురాలు ఒక కవర్ తో వచ్చింది.. ఆ కవర్ లో ఆ అబ్బాయి పెళ్ళి శుభలేఖ (Invitation) వుంది... అది చూసిన ఆ అమ్మాయి ఆ కొద్ది క్షణాలలో గుండె పగిలిన బాధని అనుభవించింది.. ఆమె ఆ కవర్ ని ఓపెన్ చేసి చూసిన తరువాత ఆశ్చర్యానికి గురి అయ్యింది.. ఎందుకంటే పెళ్ళి కూతురు గా ఉన్న పేరు ఆ అమ్మాయిదే.. "అసలు ఏం జరుగుతుంది?" అని ఆమె తన స్నేహితురాలుని అడిగే లోపే తన ఎదుట నిలబడి వున్న అబ్బాయి ని చూసింది.. ఆ అబ్బాయి అమ్మాయి తో ఇలా చెప్పాడు..
"నీ కోసం నేను 1 సంవత్సరం తిరిగాను... ఎందుకో తెలుసా?? నువ్వు లేకుండా నేను బ్రతకలేను.. నువ్వు లేని నన్ను నేను ఊహించుకోలేను.. నన్ను వదిలి ఎక్కడికి పరిపోదాం అనుకున్నావు బంగారం??" అంటూ మూగ బాష (sign language) లో చెప్పాడు.. సంతోషం, బాధ, ఒకేసారి వస్తూ ఏడుస్తున్న ఆ అమ్మాయిని చూసి ఆ అబ్బాయి ఇది చెప్పాడు.. "నేను మూగ వాడిని కాకపోయినా నీ కోసం 1 సంవత్సరం మూగ భాష నేర్చుకున్నాను.. ఎందుకో తెలుసా??? నీకు నేను చేసిన వాగ్ధానం (promise) మరచిపోలేదు., మరచిపోలేను అని చెప్పడానికి.. ఒక్కసారి నా గురించి ఆలోచించు., నీ మాట ను నేను అవుతా.. నిన్ను ప్రేమిస్తున్నా.. ప్రేమిస్తూనే వుంటా నాన" అని అదే మూగ భాష లో చెప్తూ ఆ ఉంగరం ని అమ్మాయి వేలికి పెట్టాడు.. దానితో మళ్ళీ ఆ అమ్మాయి మనసులో సంతోషం.. పెదవుల పై చిరు నవ్వు మొదలు అయ్యింది...
అది కథ...
ఇంకొక కథ:
ఒక సామాన్య రైతు కుటుంబం లో పుట్టిన ఒక రైతు తన కొడుకుని ఒక గొప్ప వ్యక్తి గా చూడాలి అనుకున్నాడు.. రేయి అనక, పగలు అనక కష్టపడి చదివించాడు.. నాన్న నెను చదవటానికి పుస్తకం లేదు.. కొనడానికి డబ్బులు లేవు అని అడిగితే ఆ తండ్రి కష్టపడి చేస్తున్న వ్యవసాయం తో పాటు ఒక చిన్న ఉద్యోగం లో చేరి తన కొడుక్కి కావల్సిన ప్రతీది ఇస్తూ, సౌకర్యం గా పెంచాడు..
కొన్ని సంవత్సరాలు తరువాత ఆ కొడుకు ఒక గొప్ప వ్యక్తి గా ఎదిగాడు.. ఒక పెద్ద ఇంజినీర్ అయ్యాడు.. అంచలు అంచలు గా ఎదిగి ఒక కంపెనీ స్థాపించాడు.. ఇంత స్థాయి కి తన కొడుకుని తీసుకు రావడానికి ఒక కిడ్నీ తో పాటు తన తండ్రి కి అయిన ఖర్చు "సుఖం లేని జీవితం, నిద్ర మరచిన రాత్రులు, అలుపు ఎరుగని కష్టం"
అసలు కష్టమే లేని జీవితం చుస్తున్నాడు కొడుకు.. తన చదువు కోసం కిడ్నీ అమ్మి చదివించిన తన తండ్రి అంటే ఆ కొడుకుకి ప్రాణం.. తన తండ్రి ని ఎంతో ప్రేమ గా చూసుకుంటున్నాడు.. వయసు పైబడింది.. తండ్రి ఆరోగ్యం క్షీనించింది.. 6 సంవత్సరాల బబు కి 60 సంవత్సరాల వృద్ధుడికి తేడా వుండదు అంటారు.. ఎందుకో తెలుసా?? వాళ్ళ ఇద్దరికి కూడా ఒకరి సహకారం కావాలి.. కాని అదే కొడుకు తనకి నడక నేర్పిన తండ్రి చివరి రోజుల్లో నడవలేక అవస్త పడుతుంటే గాలికి వదిలేసాడు..
తన మీద తన కొడుకుకి ప్రేమ ఎందుకు కరువు అయ్యింది అని ఆ తండ్రి బాధపడని రోజు లేదు.. తాగి ఇంటికి వచ్చే వాడు.. చివరి రోజుల్లో చెడిపోతున్న కొడుకుని చూసి ఏడవని రోజు లేదు ఆ తండ్రికి..
చివరికి ఒక రొజు ఆ కొడుకు తన తండ్రి ని ఎంత వద్దు అని మొత్తుకుంటున్నా బలవంతం గా తీసుకుని వెళ్ళి ఒక వృద్ధాశ్రమం లో చేర్చాడు.. కాలం గడిచింది, 6 నెలలు గడిచిన కూడా తన కొడుకు నుండి ఒక్క ఫోన్ రాలేదు... ఇప్పటికి ఆ కొడుకు తనకి ఇస్తున్న విలువకి ఒక పక్క బాధపడుతూనే ఇంకొకపక్క ఆ కొడుకు కోసం తను పడిన కష్టాన్ని తలుచుకుంటూ గర్వ పడుతున్నాడు.. వున్నట్టు ఉండి ఒక ఫోన్ కాల్, దగ్గరలో వున్న హాస్పిటల్ లో ప్రానాపాయ స్తితి లో తన కొడుకు వున్నాడు అని.. తనని ఏ మాత్రం పట్టించుకోని తన కొడుకు చావు బ్రతుకుల్లో వున్నాడని తెలిసిన ఆ తండ్రి పరుగు పరుగున వెళ్ళి తన కొడుకుని కలుసుకున్నాడు..
అప్పుడు ఆ కొడుకు తన తండ్రి తో పలికిన మాటలు..
"నేను చచ్చిపోతున్నాను నాన్న.. పుట్టిన ప్రతి వ్యక్తి ఒక రోజు చనిపొతాడు కాని ఎప్పుడు చనిపోతాడు అనేది ఎవరికి తెలీదు.. కాని నాకు దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు.. నేను చనిపోతాను అని నాకు 1 సంవత్సరం ముందె తెలుసు నాన్న.. అందుకే మిమ్మల్ని దూరం గా వుంచాను.. నా మీద అసహ్యం పుడితే నేను చనిపోయిన రోజు నన్ను చూసి నువ్వు ఏడవకుండా వుంటావు అని.. కాని నా చివరి శ్వాస నీ వడిలో పడుకుని వదలాలి అని వుంది నాన్న.. నా చావు కన్నా ముందు నేను చుపించిన ద్వేషానికి పశ్చ్యాతాపం గా నీ వడిలో నా శ్వాస వదలాలి అని వుంది నాన్న..." అంటూ తన తండ్రి వడిలోనే ప్రానాలు విడిచాడు..
చనిపోయిన కొడుకుని చూస్తు "పిచ్చోడా!! నువ్వు నన్ను ద్వేషిస్తే నీ మీద అసహ్యం పెంచుకోడానికి నువ్వు నా శత్రువు కాదు నాన.. నా కొడుకువి.. " అని బరువెక్కిన గుండెతో పలికిన మాటలు ఇంకా నా చెవిలో మారుమ్రోగుతున్నాయి...
కొడుకు చనిపోయిన తరువాత ఎంతో మంది అనాధలను దత్తతు తీసుకుని వాళ్ళని పెంచి పోషిస్తూ, చదివిస్తూ ఆ తండ్రి కూడా ఒక రోజు ప్రాణం విడిచాడు......
ఇది ఇంకొక కథ...
అసలు ఈ సమాజం లో నిజమైన ప్రేమ వుందా?? అని ప్రెశ్నించే వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం.. నేను నిజమైన ప్రేమని చూసాను... మీరు చూడలేదా???
ఇదే సమాజంలో మీ అందరికి తెలిసిన ఒక ప్రముఖ వ్యక్థి "పెళ్ళి" అనే ఒక కొత్త జీవితాన్ని అప్పటికే పెళ్ళి అయ్యి పిల్లలు వుండి భర్థ చనిపోయిన స్త్రీతో ఆరంభించాడు.. దానిని జాలి అంటే మీ తప్పు అది.. జాలి తో ఆస్తులు దానం చేయగలరు కాని జీవితాన్ని దానం చేసే మహాత్ముడు అయితే ఈ రొజుల్లో లేడు..
ఇదే సమాజం లో రోడ్ మీద పడి వున్న కొంత మంది పిల్లల్ని దత్తతు తీసుకుని వాళ్ళని చదివిస్తున్న గొప్ప వాళ్ళు వున్నారు... వాళ్ళకి ప్రేమ విలువ తెలీదా?? లేక అసలు వాళ్ళలో ప్రేమ లేదు అంటారా??
ప్రతీ బంధాన్ని చివరి బంధం గా భావించు.. అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది...
ప్రతీ క్షణాన్ని చివరి క్షణం గా భావించు.. అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో తెలుస్తుంది..
This is My Theory.., and it is called to be.....
HARSHAS THEORY
Note: Please feel free to give your comments/feedback about the post / blog here itself. Also tweet this or share this if you like this theory via twitter or facebook respectively.
heart touching annaya.. luvd it!
I swear, ee theory lifelong gurthunchukuntaanu...!